దివ్యాంగుల్లో ఆనందం
ABN , First Publish Date - 2023-06-11T00:20:27+05:30 IST
దివ్యాంగుల పింఛన్ మరింత పెరిగిం ది. ప్రస్తుతం రూ.3,016లు ఇస్తుండగా.. దానికి అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాలలో జరిగిన సభలో ప్రకటించా రు. వచ్చె నెల నుంచి రూ.4,016లు చెల్లిస్తామని స్పష్టం చేయడంతో దివ్యాంగుల్లో హర్షాతిరేకా లు వ్యక్తమవుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సంక్షేమ సంబురాల్లో ది వ్యాంగులకు తీపి కబురు అందించి నట్లయింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 11,056 మందికి లబ్ధి చేకూరనుంది. అంతే గాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగు లకు నెల నెలా పింఛన్లతో పాటు ఉప కరణాలు, వాహనాలు, ఇతర రూపా ల్లో చేయూతనందిస్తోంది.
పింఛన్ మరో రూ.వెయ్యి పెంచిన సీఎం
వచ్చే నెల నుంచి అమలు
జిల్లా వ్యాప్తంగా 11,056 మందికి లబ్ధి
ప్రభుత్వంపై రూ.1.10 కోట్ల అదనపు భారం
జఫర్‌గడ్, జూన్ 10: దివ్యాంగుల పింఛన్ మరింత పెరిగిం ది. ప్రస్తుతం రూ.3,016లు ఇస్తుండగా.. దానికి అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాలలో జరిగిన సభలో ప్రకటించా రు. వచ్చె నెల నుంచి రూ.4,016లు చెల్లిస్తామని స్పష్టం చేయడంతో దివ్యాంగుల్లో హర్షాతిరేకా లు వ్యక్తమవుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సంక్షేమ సంబురాల్లో ది వ్యాంగులకు తీపి కబురు అందించి నట్లయింది. తాజా నిర్ణయంతో జిల్లాలోని 11,056 మందికి లబ్ధి చేకూరనుంది. అంతే గాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగు లకు నెల నెలా పింఛన్లతో పాటు ఉప కరణాలు, వాహనాలు, ఇతర రూపా ల్లో చేయూతనందిస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత ఆసరా పింఛన్ నగదు పెంచింది. ఇది వరకు దివ్యాంగులకు రూ.500లు చొప్పున అందించేవారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టగానే దివ్యాంగులకు నెలకు రూ.3,016, ఇతరులకు రూ.2,016లు చొప్పున అందజేస్తున్నారు.
జిల్లాలో 11,056 మందికి లబ్ధి..
సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలోని మొత్తం 11,056 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి ఆసరా పథకం కింద నెల నెలా రూ.3,016లు చొప్పున రూ.3.33 కోట్లు పంపిణీ చేస్తోంది. ఈ లెక్కన రూ.వెయ్యి పింఛన్ పెంపుతో ప్రభుత్వంపై రూ.1.10 కోట్ల అదనపు భారం పడనుంది. పెంచిన పింఛన్‌తో ఒక ఇంట్లో ఇద్దరు దివ్యాంగులు ఉంటే ప్రతీ నెల వారికి రూ.8,032లు వస్తుంది. వారికి ఇళ్లు గడవడానికి, కొంత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడనుంది.
పెరగనున్న దరఖాస్తులు..?
దివ్యాంగులకు రూ.3,016ల పింఛన్‌తో పాటు బస్సు, రైలు ప్రయాణాల్లో రాయితీ సౌకర్యం ఉంది. దీంతో చాలా మంది సదరం ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 40 శాతంపై ఉంటేనే పింఛన్‌తో పాటు అన్ని రకాల రాయితీలు వర్తిస్తాయి. వచ్చే నెల నుంచి రూ.4,016లు పింఛన్ అందజేస్తామని సీఎం ప్రకటనతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో అర్హత కలిగిన దివ్యాంగులు అనేక మంది ఉన్నారని, సదరన్ ధ్రువీకరణ పత్రాలు ఇంకా జారీ కాలేదని వికలాంగ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామాల్లో మిగిలి ఉన్న అర్హులైన వికలాంగులను గుర్తించి వారికి సదరన్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, పింఛన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లాలో 11,056 మందికి ప్రయోజనం : గూడూరు రాంరెడ్డి, డీఆర్‌డీవో
జిల్లాలో 12 మండలాల పరిధిలోని మొత్తం 11,056 మంది దివ్యాంగ పింఛన్ దారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి ఒక్కొక్క రికి నెలకు రూ.3,016ల చొప్పున ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా మరో రూ.1000లు కలిపి రూ.4016లు వచ్చే నెల నుంచి పంపిణీ చేస్తాం.
పోరాట ఫలితంగానే పింఛన్ పెంపు : తాళ్లపల్లి కుమార్, విహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు
పోరాట ఫలితంగానే దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మందకృష్ణమాదిగ నేతృత్వంలో వికలాంగులమంతా సంఘటితంగా దశాబ్దాలుగా పోరాటం సాగించాం. నాడు రూ.200ల నుంచి దశల వారీగా రూ.1,500ల వరకు పింఛన్ పెంచారు. తదనంతరం నానాటికి పెరుగుతున్న నిత్యావసర ధరలకనుగుణంగా పెంచాలంటూ గత ఏడాదిగా ఉద్యమం సాగిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం. అయితే జిల్లా వ్యాప్తంగా ఇంకనూ సుమారు 2,100 మంది వరకు అర్హత కలిగిన వికలాంగులు ఉన్నారు. వారికి ధ్రువపత్రాలు జారీ పింఛన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి.
జీవనానికి తోడ్పాటు : కుక్కల వెంకటమ్మ, వడ్డెగూడెం (జఫర్‌గడ్)
వికలాంగుల పింఛన్ పెంచడం జీవనానికి ఎంతో తోడ్పడుతుంది. కొడుకులు, బిడ్డలు పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ సార్ మరో రూ.వెయ్యి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. ఎవరి వద్ద చేయి చాచకుండా బతికేలా చేశారు. ఈ పెంపు కుటుంబ పోషణ, జీవనానికి మరింత ఆసరా అందించినట్లయింది.