డిజిటల్‌ పాఠాలు

ABN , First Publish Date - 2023-05-26T00:47:10+05:30 IST

సర్కారు బడులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఇంగ్లీషు మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తుంది.

డిజిటల్‌ పాఠాలు
బమ్మెరలో ఏర్పాటు చేసిన మల్టీఫుల్‌ ఫీచర్స్‌ డిజిటల్‌ స్ర్కీన్‌

సర్కారు బడుల్లో నూతన విద్యాబోధన

ఒక్కో పాఠశాలకు 3 డివైజ్‌లు

వచ్చే విద్యా సంవత్సరం నుంచే

8, 9, 10 తరగతులకు అమలు

జనగామ కల్చరల్‌, మే 25: సర్కారు బడులను అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో అన్ని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఇంగ్లీషు మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తుంది. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యా బోధన జరుగుతుండగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వచ్చే విద్యా సం వత్సరం అనగా 2023-24 నుంచి డిజిటల్‌ విద్యా బోధన అందించేందుకు సిద్ధమైంది. అందుకు అవసరమైన సామగ్రిని కూడా సరఫరా చేసింది. ఒక్కో పాఠశాలలో మల్టీఫుల్‌ ఫీచర్స్‌ డిజిటల్‌ స్ర్కీన్‌ డివైజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 8,9,10 తరగతులకు డిజిటల్‌ పాఠాలు బోధించేందుకు దృశ్యశ్రవణ విధానంతో పాఠాలు బోధిస్తే సులభంగా అర్థమవడంతో పాటు ఎక్కువగా గుర్తుం చుకుంటారన్నదే రాష్ట్ర సర్కారు ఉద్దేశం.

మన ఊరు మన బడితో శ్రీకారం

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది ద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ‘మన ఊరు - మన బ డి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాల లను దశ ల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇప్ప టికే జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలు కొత్త కళను సంతరించుకున్నాయి. ‘మన ఊరు - మన బడి’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నిధులు కేటాయించడంతో చాలా చోట్ల పాఠశాలల రూపురేఖ లు మారిపోయాయి. ఆకర్షణీయమైన రంగులతో, సరికొత్త హంగులతో మౌలిక వసతుల కల్పనతో అవి చూడడానికి కార్పొరేట్‌ పాఠశాలలను తలపిస్తున్నాయి. మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగు నీరు, మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీల నిర్మా ణం, విద్యుత్‌ సౌకర్యం, భవనాలకు మరమ్మతులు, ఫర్నీచర్‌ తదితర వసతులను సమకూర్చిన ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనపై దృష్టి సారిం చింది. ఇందులో భాగంగా ’మన ఊరు - మన బడి’ లో మొదటి విడతలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్‌ బోధన అందించాలని నిర్ణయించింది.

జిల్లాలో 57 పాఠశాలల ఎంపిక..

జనగామ జిల్లాలో 103 ఉన్నత పాఠశాలలు ఉండగా 57 పాఠశాలలకు విద్యాశాఖ డిజిటల్‌ బోధనకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసిం ది. అవి కూడా మన ఊరు మన బడి కారక్రమం లో ఎంపిక చేసినవే. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలి క వసతులు కల్పించి వాటిని కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది.

2023-24 విద్యా సంవత్సరం నుంచే...

ఇందులో భాగంగా 8,9,10 తరతుల విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్‌ విధానంలో పాఠాలు బోధించాలని నిర్ణయించింది. దృశ్య, శ్రవణ విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తే వాటిని సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు పాఠం లోని అంశాలను ఎప్పుడూ గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీషు మీడియంలో బోధన కొనసాగుతుందగా తాజాగా డిజిటల్‌ పాఠాలు అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

మల్టీ ఫీచర్స్‌తో డిజిటల్‌ స్ర్కీన్‌...

‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ విధానంతో పాఠాలు బోధించడానికి మల్టిపుల్‌ ఫీచర్స్‌ డిజిటల్‌ స్ర్కీన్‌ డివైజ్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో వీటిని అమర్చారు. 75 అంగుళాలు ఉన్న స్ర్కీన్లను 8,9,10 తరగతులకు ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక్కో పాఠశాలకు 3 స్ర్కీన్లు అన్నమాట. వీటికి ఇంటర్నెట్‌, వైఫై, మొబైల్‌ హాట్‌స్పాట్‌ సదుపాయం కల్పిస్తారు. తద్వారా విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియోలు, త్రీడీ ఇమేజ్‌లను గూగుల్‌ సెర్చ్‌, యూట్యూబ్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

స్ర్కీన్‌ మూసివేస్టే గ్రీన్‌ చాక్‌ బోర్డు

ఈ స్ర్కీన్‌ను మూసివేస్తే గ్రీన్‌ చాక్‌ బోర్డులా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. డిజిటల్‌ పెన్‌ ద్వారా బోర్డుపై రాయవచ్చు. మొబైల్‌ నుంచి ఈ డివైజ్‌కు వీడియోలు పంపించుకోవచ్చు. పాఠాలకు సంబందించిన మ్యాటర్‌ను మనం కోరిన భాషలో చదివి వినిపిస్తుంది. విద్యార్థులకు బోధించిన పాఠాలను డీసీఎఫ్‌, డాక్యుమెంట్‌, జేపీజీ, పీపీటీ ఫార్మాట్‌లో సేవ్‌ చేసుకునే సదుపాయం ఉంది. టీవీ స్ర్కీన్‌లతో పాటు అవసరమైన బ్యాటరీలు, స్టెబిలైజర్‌ను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది. వేసవి సెలవుల్లో వీటిని కాపాడే ఉద్దేశంతోనే పాఠశాలలకు నైట్‌ వాచ్‌మెన్‌ లను ఏర్పాటు చేశారు. ఒక్కో స్ర్కీన్‌ ధర దాదాపు రూ.3 లక్షలు ఉండగా 3 తరగతులకు కలిపి రూ.9 లక్షలు వెచ్చించారు.

ఈ విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం : బొమ్మనబోయిన శ్రీనివాస్‌, సెక్టోరియల్‌ అధికారి

‘మన ఊరు - మన బడి’ కింద జిల్లాలో ఎంపిక చేసిన 57 పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్‌ విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. 8, 9, 10 తరగతులకు పాఠాలు బోధించడానికి అవసరమైన స్ర్కీన్లు, బ్యాటరీలు, స్టెబిలైజర్లు సరఫరా చేశాం. పాఠశాలలు తెరిచే నాటికి ఇవి అందుబాటులో ఉంటాయి. డిజిటల్‌ విద్యాబోధన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Updated Date - 2023-05-26T00:47:10+05:30 IST