గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2023-06-26T01:03:39+05:30 IST
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. గార్ల మండలం సరిహద్దుతండా నుంచి రాజ్యాతండా వరకు రూ.1.30 కోట్లు, ముత్తితండాలో రూ.1 కోటితో బీటీ రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
గార్ల, జూన్ 25: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. గార్ల మండలం సరిహద్దుతండా నుంచి రాజ్యాతండా వరకు రూ.1.30 కోట్లు, ముత్తితండాలో రూ.1 కోటితో బీటీ రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తండాలకు మహర్దశ పట్టిందన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, పాఠశాలలు, మౌలిక సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని పేదలందరికి గృహలక్ష్మి పథకంలో ప్రతీ ఒక్కరు ఇళ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారుకు రూ.3 లక్షలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గ్రామాల్లోని అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు పథకంలో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం విడతల వారిగా నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. గార్ల మండల కేంద్రంలో ఇటీవల దాడిలో గాయపడిన ఎంపీపీ మూడ్ శివాజీచౌహాన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో మర్రిగూడెం, కోట్యినాయక్ తండా సర్పంచ్‌లు భూక్యా బుజ్జి, బానోత్ శ్రీనునాయక్, ఎంపీటీసీలు మన్నేపల్లి సుగుణాదేవి, శీలంశెట్టి రమేష్, సర్పంచ్‌లు మోతీలాల్ నాయక్, సక్రు నాయక్, మాలోత్ జ్యోతి, కోఆప్షన్ సభ్యుడు ఎండీ.ఖదీర్‌బాబా, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, పానుగంటి రాధకృష్ణ, బుడిగె మురళి, గాజుల గణేష్, రావూజీనాయక్, మీగడ శ్రీనివాస్ పాల్గొన్నారు.