సీపీ రంగనాథ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-03-31T00:07:23+05:30 IST

తమ భూ సమస్యను పరిష్కరించినందుకు వరంగ ల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ ఫ్లెక్సీకి గురువారం బాధితులు క్షీరాభిషేకం చేశా రు. వరంగల్‌ జిల్లా ఏనుమాముల మార్కెట్‌ ప్రాంతంలోని బాలాజీనగర్‌ భూ బా ధితులు లేబర్‌కాలనీకి వెళ్లే వంద ఫీట్ల రోడ్‌లో సీపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

సీపీ రంగనాథ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
సీపీ రంగనాథ్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న బాలాజీనగర్‌ భూ బాధితులు

వరంగల్‌ సిటీ, మార్చి 30: తమ భూ సమస్యను పరిష్కరించినందుకు వరంగ ల్‌ పోలీసు కమిషనర్‌ రంగనాథ్‌ ఫ్లెక్సీకి గురువారం బాధితులు క్షీరాభిషేకం చేశా రు. వరంగల్‌ జిల్లా ఏనుమాముల మార్కెట్‌ ప్రాంతంలోని బాలాజీనగర్‌ భూ బా ధితులు లేబర్‌కాలనీకి వెళ్లే వంద ఫీట్ల రోడ్‌లో సీపీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.

బాధితులు షాబోతు శ్రీనివాస్‌, కోదాటి రమేష్‌, గౌస్‌ బేగం, ఆడెపు భిక్షపతి, రాజు, దేవులపల్లి మల్లేష్‌లు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం స్థలాలను కొనుగోలు చేసి నట్టు తెలిపారు. కాగా, అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు, తన అనుయా యులతో భూ సమస్యలు సృష్టించి, కబ్జాచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు పేర్కొ న్నారు. ఈ విషయమై సీపీకి ఫిర్యాదు చేయగా, సీపీ మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపారన్నారు. వారు అనుమానితులను విచారణ చేయగా నిజాలు బ యటకు వచ్చాయని వాటి ఆధారంగానే దీంతో బుధవారం ఈస్ట్‌జోన్‌ డీసీపీ కరు ణాకర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ డాక్టర్‌ జితేందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌తోపాటు ఏనుమా ముల సీఐ మహేందర్‌ ఏనుమాముల ప్రాంతంలో కబ్జాకు గురైన ప్లాట్లను సంద ర్శించి బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించినట్టు వెల్లడించారు. నిజనిర్ధారణ చేసుకుని ఎవరి ప్లాట్లు వారికి అప్పగించాలని కబ్జాదారులకు హెచ్చరించినట్టు తెలి పారు. దీంతో ఏళ్ల నాటి భూ సమస్యకు పరిష్కారం లభించినట్టయిందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా పోలీస్‌ బాస్‌ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసినట్టు తెలిపారు.

Updated Date - 2023-03-31T00:07:23+05:30 IST