ఏ యంత్రంలో ఏముందో..?!
ABN , First Publish Date - 2023-12-02T23:24:34+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల చివరి ఘట్టం రానే వచ్చింది. క్షణక్ష ణం ఉత్కంఠ... నెలరోజుల శ్రమ అనంతరం ఐదేళ్ల భవి తవ్యం తేలే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం సాగనుంది.
నేడే ఓట్ల లెక్కింపు
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి
భూపాలపల్లిలో 14 టేబుల్స్, 23 రౌండ్లు
638 ఈవీఎంలల్లో 23 మంది అభ్యర్థుల భవితవ్యం
ములుగులో 14 టేబుల్స్, 22 రౌండ్లు
11 మంది అభ్యర్థులు.. 303 ఈవీఎంలు
భూపాలపల్లి కలెక్టరేట్/ములుగు, డిసెంబరు 2: అసెంబ్లీ ఎన్నికల చివరి ఘట్టం రానే వచ్చింది. క్షణక్ష ణం ఉత్కంఠ... నెలరోజుల శ్రమ అనంతరం ఐదేళ్ల భవి తవ్యం తేలే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం సాగనుంది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం కల్లా స్పష్టమైన ఫలితాలు రానున్నాయి. భూపాలపల్లి, ములుగు నియోజవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారు లు సర్వం సిద్ధం చేశారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ ప్రక్రియ కొనసాగనుండగా, ములుగు కలెక్టరేట్‌లోని స్ర్టాంగ్‌రూంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
భూపాలపల్లిలో 2,24,432 ఓట్లు..
భూపాలపల్లి నియోజకవర్గంలోని 317 పోలింగ్ కేం ద్రాల్లో ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు 23 రౌండ్లల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 1,345 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు అదనంగా మరో మూడు టేబు ళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. ఉదయం 7 గంటలకు నిఘా నీడలో స్ట్రాంగ్ రూంల నుంచి ఈవీఎంలను తరలిస్తారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటిని తెరుస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కిస్తారు. 8.30 గంటలకు ఈవీఎంలకు సంబంధించిన ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. ని యోజకవర్గంలోని 317 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 638 బ్యాలెట్ యూనిట్స్, 317 కంట్రోల్ యూనిట్స్, 321 వీవీప్యాట్‌లను వినియోగించా రు. పోలైన 2,24,432 ఓట్లను పూర్తిగా లెక్కించనున్నారు. ఈవీఎంలో నిక్షిప్తమైన ఫలితా లు ఉదయం 9.30 గంటల నుంచే వచ్చే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితం కంటే మొదటి రౌండ్ ఈవీఎంల కౌంటింగ్ ఫలితమే మొదట రానున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
ఓట్ల లెక్కింపునకు సహకరించాలి : భూపాలపల్లి కలెక్టర్
భూపాలపల్లి నియోకజవర్గ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. కౌంటింగ్‌పై రాజకీయ పార్టీల ప్రతిని ధులకు దీనిపై శనివారం అవగాహన కల్పించామని తెలిపారు. ప్రశాంతంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా సహకరించాలని కోరారు.
ములుగు కలెక్టరేట్‌లో కౌంటింగ్
ములుగు అసెంబ్లీ బరిలో మొత్తం 11మంది అభ్య ర్థులు పోటీ చేయగా కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూంలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 303 పో లింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టగా అంతకు ముందు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా జరిగింది. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లను పటిష్ట పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. ఆదివారం ఉద యం 5 గంటలకు అబ్జర్వర్, రిటర్నింగ్ అధికారి సమక్షం లో సిబ్బందికి మూడో ర్యాండమైజేషన్ జరుపుతారు. 7గంటలకు కౌంటింగ్ సిబ్బంది, పార్టీల ఏజెంట్లను లోప లికి అనుమతిస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లె క్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కిం పు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 303 పోలింగ్ కేంద్రాలను 14 టేబుళ్లుగా విభజించగా 22 రౌం డ్లపాటు లెక్కింపు కొనసాగనుంది. ప్రతి రౌండ్‌కూ సం బంధించిన ఫలితాలను రిటర్నింగ్ అధికారి వెల్లడిస్తారు.
మూడంచెల భద్రత
ములుగు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు మూ డంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి అంచెలో వాహ నాల పార్కింగ్, రెండో అంచెలో రాష్ట్ర బలగాలు తనిఖీ చేసి అనుమతి ధ్రువీకరణ ఉన్న వారిని లోపలికి పంపించడంతోపాటు మూడో అంచెలో కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి. అక్కడ పూర్తిస్థాయి తనిఖీ అనంతరం కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారికి తప్ప కౌంటింగ్ కేంద్రంలోకి ఎలకా్ట్రనిక్ వస్తువులు, సెల్‌ఫోన్లకు అనుమతి లేదు.
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
ములుగు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్ ఆలం, రిట ర్నింగ్ అధికారి అంకిత్ పరిశీలించారు. సీసీ కెమెరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కూ ఒక కౌంటింగ్ ఏజెంట్‌ను రాజకీయ పార్టీల నుంచి నియమించామని, వారికి గుర్తింపుకార్డులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని వెల్లడించారు.
సంబరాలకు ఏర్పాట్లు
గెలుపు సంబరాలు జరుపుకునేందుకు ములుగు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకున్న ఫలితం వెలువడిన వెంటనే నియోజకవర్గ వ్యాప్తంగా ఏకకాలంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షం వ్యక్తంచేసేలా సన్నద్ధమయ్యారు. పలువురు ముఖ్య నాయకులు ఆదివారం ఉదయానికి ములుగులో తిష్ట వేయనున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.