కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

ABN , First Publish Date - 2023-06-26T23:52:30+05:30 IST

వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనని, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ సభ్యుడ గండ్ర సత్యనారాయణరావు ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ గెలుపు ఖాయం
సమావేశంలో మాట్లాడుతున్న గండ్ర సత్యనారాయణరావు

కృష్ణకాలనీ (భూపాలపల్లి), జూన్‌ 26: వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌దేనని, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ సభ్యుడ గండ్ర సత్యనారాయణరావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పట్టణ ముఖ్యకార్యకర్తల సమా వేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుం దన్నారు. కార్యకర్తలు నాలుగు నెలలు కష్టపడితే విజయం సొంతమవు తుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలకు బీఆర్‌ ఎస్‌ చేసింది శూన్యమన్నారు. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్లావత్‌ దేవన్‌, చల్లూరి మధు, దాట్ల శ్రీనివాస్‌, అంబాల శ్రీనివాస్‌, భట్టు కరుణాకర్‌, జోగ బుచ్చయ్య, పొనగంటి శ్రీనివాస్‌, బౌతు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:52:30+05:30 IST