కేంద్రం హామీల అమలుకు ప్రజాపోరు

ABN , First Publish Date - 2023-03-19T00:11:19+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సీపీఐ ఈ నెల 25 నుంచి ప్రజాపోరు యాత్రను నిర్వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివా్‌సరావు అన్నారు.

కేంద్రం హామీల అమలుకు ప్రజాపోరు
ముల్కనూర్‌లో విరాళాలు సేకరిస్తున్న తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

25 నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పాదయాత్ర

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.శ్రీనివా్‌సరావు

భీమదేవరపల్లి, మార్చి 18: ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సీపీఐ ఈ నెల 25 నుంచి ప్రజాపోరు యాత్రను నిర్వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివా్‌సరావు అన్నారు. మండలంలోని ముల్కనూర్‌లో శనివారం ప్రజాపోరు యాత్రకు సీపీఐ నాయకులు విరాళాలు సేకరించారు.

ఈ సందర్భంగా శ్రీనివా్‌సరావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్‌ విభజన చట్టం 2014 సందర్భంగా పార్లమెంట్‌లో చట్టం చేసినా అమలు కావడం లేదన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్‌ వ్యాగన్‌ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం తదితర హామీలను ఇచ్చారన్నారు. కానీ, ఎనిమిదేళ్లు గడిచినా ఇచ్చిన హామీని అమలు చేయకపోగా తెలంగాణపై వివక్షతతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజల ఆకాంక్ష ఉద్యోగ, ఉపాధి దొరకకుండా కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 25 నుంచి సీపీఐ ప్రజాపోరు యాత్రను ప్రారంభిస్తుందన్నారు. బయ్యారం నుంచి మార్చి 25న ప్రారంభమయ్యే ప్రజాపోరు యాత్ర ఏప్రిల్‌ 5న హనుమకొండలో ముగిస్తుందన్నారు. ఏప్రిల్‌ 1న కేరళ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్‌ ముల్కనూర్‌లో జరిగే పోరు యాత్రలో పాల్గొంటారన్నారు.

లిక్కర్‌ స్కామ్‌లో ఇరుక్కున్న బిడ్డ కవితను రక్షించే ప్రయత్నంలో సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని శ్రీనివా్‌సరావు అన్నారు. టీఎ్‌సపీఎస్సీ పత్రాలు లీకేజీ అయి నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నా తనకు ఏం పట్టనట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారన్నారు. 2023 వరకు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారిని క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ భూము ల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు క్రమబద్ధీకరణ కోసం డబ్బు లు చెల్లించాలని నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సీపీఐ మం డల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంగల రాంచంద్రారెడ్డి, సీపీఐ నాయకులు మంచాల రమ, మంచాల తిరుపతి, కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, కూన యాదగిరి, ఉమ, మమత, పద్మ, మౌనిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:11:19+05:30 IST