గండ్లు కనబడతలేవా..?!

ABN , First Publish Date - 2023-03-18T22:48:56+05:30 IST

లక్నవరం సరస్సుకు లీకేజీలు శాపమయ్యాయి. విలువైన జలాలు వృఽథాగా పోతుండటం, పంట కాల్వలు తెగి జల్లెడలా మారడం తో చివరి ఆయకట్టుకు నీరందక అన్నదాతలు ఆందోళ న చెందుతున్నారు.

గండ్లు కనబడతలేవా..?!
తూము ద్వారా వృథాగా పోతున్న లక్నవరం నీరు.., తెగిపోయిన పంట కాల్వ

లక్నవరం సరస్సుకు లీకేజీలు

వృఽథాగా పోతున్న జలాలు

తూములు, కల్వల ఆధునికీకరణకు కలగని మోక్షం

ఏటా ఎండుతున్న చివరి ఆయకట్టు

రూ.20 కోట్లతో ఐబీ అధికారుల ప్రతిపాదనలు

ఏడాదైనా ఆమోదానికి నోచుకోని వైనం

గోవిందరావుపేట, మార్చి 18: లక్నవరం సరస్సుకు లీకేజీలు శాపమయ్యాయి. విలువైన జలాలు వృఽథాగా పోతుండటం, పంట కాల్వలు తెగి జల్లెడలా మారడం తో చివరి ఆయకట్టుకు నీరందక అన్నదాతలు ఆందోళ న చెందుతున్నారు. తూముల మరమ్మతు, కాల్వల ఆధునికీకరణ కోసం నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలకు మోక్షం లభించకపోవ డంతో ఏటేటా పంటలు ప్రమాదంలో పడుతున్నాయి.

ఆయకట్టులో 11,700 ఎకరాలు

లక్నవరం సరస్సు విస్తీర్ణం 5,555 హెక్టార్లు ఉం టుంది. స్థానికంగా అనావృష్టి ఏర్పడినా ఎగువ ప్రాం తంలో కురిసిన వర్షాల వరదను లక్నవరం సరస్సు లోకి చేరేలా కాకతీయులు ముందుచూపుతో వ్యవహరించారు. సరస్సు నీటి నిల్వ సామర్థ్యం 2.1 టీఎంసీలు. ఆయకట్టులో అధికారికంగా 8,700 ఎకరాలు, అనఽధికారికంగా మరో 3 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. అనాదిగా రైతులు ఇక్కడ వరి సాగునే జీవనాధారంగా చేసుకున్నారు. ఆయకట్టు మొత్తానికి నీటిని అందించేందు కోసం 80 కిలోమీటర్ల మేర మొత్తం ఐదు కాల్వలను (రంగాపూర్‌, కోట, శ్రీరాంపతి, నర్సింహుల-1, నర్సింహుల-2) నిర్మించారు. ఖరీఫ్‌లో పూర్తి ఆయకట్టు సాగులోకి వస్తుంది. రబీలో మాత్రం సరస్సులో నీటి మట్టానికి అనుగుణంగా రొటేషన్‌ పద్ధతిలో తైబందీని ప్రకటిస్తారు.

శిథిలమైన తూములు.. బుంగలు పడ్డ కాల్వలు

నిజాం పాలనలో చివరిసారిగా మరమ్మతు జరిగిన లక్నవరం తూములు శిథిలమైపోయాయి. ఏటా వర్షాలు, వరదలకు కాల్వలు కూడా ఎక్కడికక్కడ తెగిపోయాయి. చెరువులో పూటిక తీయకపోవడంతో సుమారు లక్ష క్యూబిక్‌ మీటర్ల ఒండ్రుమట్టి పేరుకుపోయింది. కాల్వలు కూడా గడ్డి, పిచ్చిమొక్కలతో పూడుకుపోయాయి. తూముల నుంచి భారీగా నీరు బయటకొచ్చి సద్దిమడుగు గుండా కిందకు ప్రవహిస్తోంది. ఇలా ప్రతి పంట కాలంలోనూ 150 ఘనపుటడుగుల మేర నీరు వృథాగా పోతోంది. ఈ నీరు వెయ్యి ఎకరాలను సాగులోకి తెస్తుందని అంచనా. సరస్సు నీటిమట్టా నికి అనుగుణంగా ప్రకటించిన తైబందీ ప్రకారంగా రైతులు నాటు వేసుకుంటే లీకేజీలతో ముందే నీరు అడుగంటి చివరి ఆయకట్టుకు అందడం లేదు. దీంతో ప్రతిసారి సుమారు వందెకరాల వరి పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు.

రూ.20 కోట్లతో ప్రతిపాదనలు..

తూముల లీకేజీ లు, కాల్వలకు గండ్ల తో పంటలు ఎండి పోతున్న తీరు, పెరు గుతున్న నష్టం దృష్ట్యా రైతుల డిమాండ్‌ మేరకు ములుగు డివిజన్‌ నీటిపారుదల శాఖ అధికారులు క్యాడ్‌వామ్‌ (సీఎడీడబ్ల్యూఎం) పథకంలో భాగంగా రూ.20 కోట్లతో ఏడాది క్రితం ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిం చారు. అయితే ఇప్పటి వరకు ఎటువం టి స్పందన కనిపించలేదు. తూము లకు స్కిన్‌వాల్‌ నిర్మించడంతోపాటు పంట కాల్వల్లో 25 కిలోమీటర్ల మేర గైడ్‌వాల్‌, వరద కాల్వలకు మత్తళ్లు, డ్రెయినేజీ, కట్టల బలోపేతం, దుంపెల్లిగూడెం నుంచి బుస్సాపురం మీదుగా రంగాపూర్‌ వరకు పంట కాల్వ పొడవునా రోడ్డు నిర్మాణం కోసం ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. సరస్సు వద్ద నిత్యం పర్యవేక్షణ కోసం ఇద్దరు లష్కర్లతోపాటు మరో ఇద్దరు వాచ్‌మన్లు, పంట కాల్వల వద్ద ఆరుగురు లష్కర్లను నియమించాలని కూడా ప్రతిపాదించారు. వీటిలో దేనికీ ఆమోదం లభించకపోవడంతో ఈసారి కూడా లీకేజీల బెడద తప్పేట్టు లేదు.

సద్దిమడుగే ప్రధానం..

తూముల నుంచి విడుదల చేసిన నీటిని కాల్వలకు మళ్లించేందుకే సద్దిమడుగే ప్రధానం. బాలెన్స్‌డ్‌ రిజర్వాయర్‌గా పనిచేసే ఈ సద్దిమడుగు కూడా శిథిలమైపోయింది. ఐదు ఎంసీఎఫ్‌టీ నీటినిల్వ సామర్థ్యం కలిగిన సద్దిమడుగు కట్టను బలోపేతం చేయడంతోపాటు షెట్టర్లను నిర్మించాల్సి ఉంది.

నిధులు మంజూరు కాగానే పనులు

-సుధీర్‌, ఐబీ ఏఈ

లక్నవరం సరస్సు తూము, కాల్వల మరమ్మతు కోసం రూ.20 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే టెండర్లు నిర్వహించి పనులు మొదలు పెడతాం. ఖరీఫ్‌ ప్రారంభమైన నేపథ్యంలో కాల్వల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, పూటికను తొలగిస్తున్నాం. గండ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాం.

Updated Date - 2023-03-18T22:48:56+05:30 IST