రామన్న సభకు రావాలె అక్క..
ABN , First Publish Date - 2023-02-21T00:40:46+05:30 IST
బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురుపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కోరారు.
కృష్ణకాలనీ (భూపాలపల్లి), ఫిబ్రవరి 20: బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురుపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటనను విజయవం తం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించ నున్న కేటీఆర్ సభలో పాల్గొనాలని పట్టణం లోని 26, 30వ వార్డుల్లో సోమవారం ఇంటింటా తిరిగుతూ ప్రచారం చేశారు. ప్రతిఒక్కరినీ పలకరిస్తూ సభకు ఆహ్వానిం చారు. మహిళలకు బొట్టు పెట్టి ‘రామన్న సభకు తప్పకుండా రావాలె అక్క..’ అని విజ్ఞప్తి చేశారు. మొదటిసారిగా మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రానికి వస్తున్నార న్నారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలకాలని కోరారు కృష్ణకాలనీ లోని అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొనాల న్నారు. ఆమె వెంట ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.