అద్భుత శిల్పం... అమోఘ వర్ణం... అపురూప కృష్ణం...

ABN , First Publish Date - 2023-04-18T00:23:57+05:30 IST

ప్రపంచ వారసత్వ దినోత్సవానికి ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయం ముస్తాబైంది.

అద్భుత శిల్పం...  అమోఘ వర్ణం...  అపురూప కృష్ణం...

నేడు జగద్విఖ్యాత రామప్ప ఆలయంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం

నేడు రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు

హాజరుకానున్న ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు,

థమన్‌, శివమణి, కార్తీక్‌ తదితర కళాకారుల రాక

భూపాలపల్లి, ఆంధ్రజ్యోతి/ వెంకటాపూర్‌(రామప్ప), ఏప్రిల్‌ 17: ప్రపంచ వారసత్వ దినోత్సవానికి ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయం ముస్తాబైంది. ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో మంగళవారం ఈ కార్యక్రమం జరగ నుంది. ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కిం చుకున్న రామప్పపై ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు యునెస్కో దీనికి శ్రీకారం చుట్టింది. వారసత్వ సంపద, ప్రాధాన్యాన్నితెలియజేసేలా కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీంతో రామప్ప కళా నైపుణ్యం, శిల్ప సంపద విశ్వవ్యాప్తం కానుంది.

వారసత్వ దినోత్సవ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామప్ప సరస్సు కట్టపై ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహి స్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నృత్యప్రదర్శనలు, కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు రామప్ప ఆలయం పక్కనే భారీ స్టేజీని నిర్మించి ఐదు వేల మంది కూర్చునేలా కుర్చీల ను ఏర్పాటు చేశారు. పేరిణి నృత్యాన్ని ప్రదర్శించేందు కు రంజిత్‌ బృందం రామప్పకు చేరుకుంది. దీంతో పాటు అరబి ఇనిస్టిట్యూట్‌ వారి వీణ గాన ప్రదర్శన నిర్వహించనున్నారు.

ఆన్‌ టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ద లెవెన్త్‌ హెడ్‌, బెంగళూరుకు చెందిన సూర్య ఎస్‌.రావ్‌ ఆధ్వర్యంలో రావణ ప్రదర్శన చేయనున్నారు. హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో శ్రావ్య–మానస నృత్య ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ డ్రమ్‌ కళాకారుడు శివమణి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌, గాయకుడు కార్తీక్‌, ఫ్లూట్‌ నవీన్‌తో ప్రత్యేక ప్రదర్శనల నిర్వ హ ణకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు మొత్తం 300 మంది కళాకారులు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు అధికారులు తెలి పారు. దీంతోపాటు బలగం చిత్ర ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఆ సినిమా బృందానికి ఘనంగా సన్మానించనున్నారు.

ముగ్గురు మంత్రుల రాక

రామప్ప ఆలయంలో నిర్వహిస్తున్న వారసత్వ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రామప్ప ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు ని ర్వహించనున్నారు. అనం తరం రామప్ప సరస్సు కట్టపై నిర్వహిస్తున్న ఫుడ్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి జరిగే కళా, నృత్య ప్రదర్శనలను మంత్రులు తిలకించనున్నారు.

మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

కార్యక్రమాలు ఇలా..

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామప్ప సరస్సు కట్టపై ఫుడ్‌ ఫెస్టివల్‌

సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు అరబి వయోలిన్‌ వాయిద్య కళాకారుడు గురుజీ అశోక్‌ గుజ్జల్‌ ప్రదర్శన

6 గంటల నుంచి 6.15 వరకు జ్యోతిప్రజ్వలన

6.15 నుంచి 6.25 వరకు పేరిణి రాజుకుమార్‌ బృందంతో నృత్య ప్రదర్శన

6.25 నుంచి 6.30 వరకు రామప్ప వారసత్వంపై వీడియో ప్రదర్శన

6.35 నుంచి 6.50 వరకు రావణ ప్రదర్శన

6.55 నుంచి 7.20 వరకు భారత సంస్కృతీ సంప్రదాయ, గిరిజన నృత్య ప్రదర్శనలు

7.20 నుంచి 7.30 వరకు బలగం చిత్రం బృందానికి సన్మానం

7.30 నుంచి 7.45 వరకు విద్యాజ్యోతి రచించిన ‘రామప్ప ఆలయ నిత్యం.. శాస్త్రం’ పుస్తక ఆవిష్కరణ – 7.45 నుంచి 7.50 వరకు రామప్ప చరిత్రపై లేజర్‌షో

8 గంటల నుంచి 8.15 వరకు కళాకారులు, అతిథులు, దాతలకు సన్మానం

8.15 నుంచి 9.45 వరకు ఎస్‌ఎస్‌ థమన్‌, శివమణి, కార్తీక్‌, ఫ్లూట్‌ నవీన్‌ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన

9.45 నుంచి 9.50 వరకు ముగింపు కార్యక్రమం.

Updated Date - 2023-04-18T00:23:57+05:30 IST