‘దశాబ్ది’ సంబురం

ABN , First Publish Date - 2023-06-02T00:09:03+05:30 IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు పూర్తి చేసుకొని, శుక్రవారం (నేడు) పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వేడుకలకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.

‘దశాబ్ది’ సంబురం
రంగురంగుల విద్యుద్దీప కాంతులతో జిల్లా సమీకృత కార్యాలయ భవనం

నేటి నుంచి ‘రాష్ట్ర అవతరణ’ వేడుకలు షురూ

కలెక్టరేట్‌లో పతాకావిష్కరణ

ముఖ్యఅతిథిగా హాజరు కానున్న మంత్రి ఎర్రబెల్లి

ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా అధికారయంత్రాంగం

జనగామ కల్చరల్‌, జూన్‌1 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు పూర్తి చేసుకొని, శుక్రవారం (నేడు) పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వేడుకలకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఈనెల 2న తెలంగాణ ఆవిర్భా వ దినోత్సవాన్ని నిర్వహించేందు కు జిల్లాలో అధికారులు అన్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో గురువారం మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్‌ శివలింగయ్యతో కలిసి అధికారులతో సమీక్షా సమావే శం కూడా నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 22 వర కు 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనుండగా రోజు కో శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమా లు చేపట్టనున్నారు.

9 ఏళ్ల ప్రగతిని ప్రజలకు వివరించడం..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 9 ఏళ్లు పూర్తికాగా ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు ఉన్నటువంటి పరిస్థితులు, తరువాత సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఉచిత చేపపిల్లల పంపిణీ, దళితబంధు, గొర్రెల పం పిణీ మొదలగు ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరాలను గ్రామా ల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ద్వారా తెలియజేస్తారు.

తొలిరోజు షెడ్యూలు ఇలా..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరారు చేసింది. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రం లో జరిగే వేడుకలకు గ్రామీణ పంచాయతీరాజ్‌ శాఖామంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.పతాకావిష్కరణ గావించి, వేడుకలు ప్రారంభించనున్నారు.

ఉదయం 8.40 ముఖ్యఅతిథి కలెక్టరేట్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుంటారు.

8.45 తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు.

8.55 ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు.

9.00 జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

9.05 పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.

9.10 తెలంగాణ అభివృద్ధిపై ముఖ్యఅతిథి ప్రసంగిస్తారు.

9.30 సాంస్కృతిక కార్యక్రమాలు

జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు..

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవా రం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్థాయి. అదే విధంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అన్ని విద్యాసంస్థల్లోనూ, కార్యాలయాల్లోనూ ఉత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

Updated Date - 2023-06-02T00:09:03+05:30 IST