Share News

Vinayabhaskar: క్యాంపు కార్యాలయం ఖాళీ చేసిన వినయభాస్కర్‌

ABN , First Publish Date - 2023-12-05T12:51:05+05:30 IST

హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌

Vinayabhaskar: క్యాంపు కార్యాలయం ఖాళీ చేసిన వినయభాస్కర్‌

హనుమకొండ టౌన్‌: హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌(Dasyaam Vinayabhaskar) ఖాళీ చేశారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన వినయభాస్కర్‌... కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చెందిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన సోమవారం అధికారిక క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. హంటర్‌రోడ్డులోని విల్లాకు మారారు. కాగా, క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి వినయభాస్కర్‌ను కలిసి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇన్నేళ్ల అనుబంధాన్ని పంచుకున్నారు. వారిని చూసి వినయభాస్కర్‌ కూడా చలించిపోయారు. బాధతో అభిమానులను ఓదార్చారు.

Updated Date - 2023-12-05T12:51:07+05:30 IST