Hyderabad : మాదాపూర్‌లో తప్పిన పెను ప్రమాదం.. భారీ బండరాళ్లతో వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా..
ABN , First Publish Date - 2023-06-26T08:13:50+05:30 IST
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పెనుప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం భారీ బండరాళ్లతో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడింది. మాదాపూర్ హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. భారీ బండరాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మాదాపూర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని (Hyderabad) మాదాపూర్‌లో పెనుప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం భారీ బండరాళ్లతో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడింది. మాదాపూర్ (Madhapur) హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. భారీ బండరాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో మాదాపూర్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో అరగంటలో ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.