TS NEWS: ఆ కేసులో మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో మారిన సీన్.. విచారణలో బయట పడుతోన్న పోలీసుల నిర్వాకం
ABN , Publish Date - Dec 26 , 2023 | 06:06 PM
పంజాగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంపై విచారణలో పోలీసుల నిర్వాకం బయట పడుతోంది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్: పంజాగుట్ట వద్ద రోడ్డు ప్రమాదంపై విచారణలో పోలీసుల నిర్వాకం బయట పడుతోంది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో పోలీస్ స్టేషన్‌కు మాజీ ఎమ్మెల్యే షకీల్ వచ్చారు. సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని పోలీసులు కేసులో చేర్చారు. సీసీ కెమెరాలో షకీల్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై విచారణ కొనసాగుతోంది. సోహైల్‌తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.
పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావుకు అస్వస్థత రావడంతో కేర్ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో దుర్గారావు అస్వస్థకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయనను హుటాహుటిన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లోని కేర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కేర్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు దుర్గారావును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.