CM KCR: కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా.. ఎందుకంటే..?
ABN , First Publish Date - 2023-02-13T16:06:40+05:30 IST
రేపటి సీఎం కేసీఆర్ (CM KCR) కొండగట్టు పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. మంగళవారం భక్తుల రద్దీ కారణంగా సీఎం పర్యటన వాయిదా వేస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్: రేపటి సీఎం కేసీఆర్ (CM KCR) కొండగట్టు పర్యటన ఎల్లుండికి వాయిదా పడింది. మంగళవారం భక్తుల రద్దీ కారణంగా సీఎం పర్యటన వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. ఆలయ పునర్నిర్మాణం కోసం కొండగట్టు ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉన్నందున నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలగకూడదనే పర్యటన వాయిదా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కాగా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కొండగట్టు (Kondagattu)ను ఆలయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మ వారి కన్నీటిధార, భేతాళ స్వామి ఆలయంతో పాటు తదితర ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. ఆలయాన్ని పరిశీలించిన అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.