TS News: వ్యభిచార గృహాలపై దాడి... పొలిటికల్ నేతలున్నట్లు అనుమానం

ABN , First Publish Date - 2023-01-30T16:25:28+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఎక్కువగా వ్యభిచార గృహాలపై పోలీసు (Police)లు ఫోకస్ పెట్టి దాడులు నిర్వహించడం జరిగింది.

TS News: వ్యభిచార గృహాలపై దాడి... పొలిటికల్ నేతలున్నట్లు అనుమానం

భద్రాద్రి: జిల్లా వ్యాప్తంగా ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఎక్కువగా వ్యభిచార గృహాలపై పోలీసు (Police)లు ఫోకస్ పెట్టి దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడుల్లో వ్యభిచారులు పట్టుబడ్డారు. మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 9 మంది నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో BRS నేత, లోతువాగు సర్పంచ్ (Lothuvagu Sarpanch) పడిగ ప్రశాంత్ (Padiga Prashanth) వున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతోనే వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారని తెలుస్తోంది. ఈ దాడుల్లో పొలిటికల్ లీడర్లు ఉండటం దారుణమని స్థానికులు చెబుతున్నారు. ఒకరికి బుద్ధిచెప్పాల్సిన వారే ఇటువంటి పనులు చేయడం తగదని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - 2023-01-30T16:25:31+05:30 IST