Share News

Governor TamiliSai: స్టేజీ ఎక్కుతూ కింద పడిపోయిన తెలంగాణ గవర్నర్

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:49 PM

Governor TamiliSai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు.

Governor TamiliSai: స్టేజీ ఎక్కుతూ కింద పడిపోయిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే తన రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గవర్నర్‌‌కు సహాయం చేసి పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా గతంలోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నడుస్తూ కిందపడ్డారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో పత్తిపులం గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నడుస్తూ వేదికపైకి వెళ్తుండగా కార్పెట్ మీద ఒక్కసారిగా జారి కిందపడ్డారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 22 , 2023 | 08:49 PM