Big Breaking : సమ్మె చేస్తున్న జేపీఎస్‌లకు ఊహించని ఝలక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్..

ABN , First Publish Date - 2023-05-12T23:03:25+05:30 IST

తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

Big Breaking : సమ్మె చేస్తున్న జేపీఎస్‌లకు ఊహించని ఝలక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్..

తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్లతో సీఎస్ శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను చర్చించినప్పటికీ విఫలం అయ్యాయి. జేపీఎస్‌లను చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని సీఎస్ స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. అంతేకాదు ఉద్యోగాలకు రాకపోతే వారిని ఉద్యోగుల కింద పరిగణించబడదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. శనివారం నాడు విధుల్లో ఉన్నవారి జాబితాను మధ్యాహ్నం లోపు పంపాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని.. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో తాత్కాలిక కార్యదర్శలను నియమించాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు. ఈ ప్రక్రియలో గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు. సమ్మె విరమించి వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చు లేదంటే ఇప్పటికి వారి టర్మ్ ముగిసింది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రభుత్వంతో సంబంధం లేదని సీఎస్ ప్రకటించేశారు. పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసేసింది.

CS-Santha-Kumari.jpg

రిక్రూటింగ్ ఇలా..!

రిక్రూటింగ్‌కు సంబంధించి ఎలా చేయాలి..? ఎవరెవర్ని తీసుకోవాలి..? అనేదానిపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది.

- త్వరలోనే గ్రామ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామాల్లో గ్రామసభ నిర్వహించాలి

- గతంలో పంచాయతీ సెక్రటరీ పరీక్షకు హాజరైన వారిని లేదా రిజర్వేషన్ ప్రాతిపదికగా తీసుకోవాలి

- గ్రామసభ నిర్వహించిన తర్వాత విధుల్లోకి చేర్చుకోవాలి

- డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా పంచాయతీరాజ్ జూనియర్ సెక్రటరీలుగా నియామకం చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

మొత్తానికి చూస్తే.. ఇప్పుడు జేపీఎస్‌ల ముందు అయితే ఎలాంటి ఆప్షన్లు లేవనే చెప్పుకోవాలి. ఎందుకంటే జూనియర్ల పీరియడ్ అయిపోవడం ఒకటైతే.. పొడిగింపులు కూడా ఉండవని చెప్పడంతో దారులన్నీ మూసుకున్నట్లే. వెళ్తే శనివారం మధ్యాహ్నం జాబ్‌లో జాయిన్ అవ్వడమా..? లేకుంటే మిన్నకుండిపోవడమా..? అనేది జేపీఎస్‌లు తేల్చుకోవాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Updated Date - 2023-05-12T23:09:35+05:30 IST