KCR Swaroopanandendra: స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2023-05-31T18:19:26+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) మరోసారి విశాఖ శ్రీ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని (Swaroopanandendra Saraswati) ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలోని చందానగర్‌లో శ్రీ విశాఖ శారదాపీఠం పాలిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బస చేసిన స్వరూపానందేంద్రను కేసీఆర్ కలిశారు. బుధవారం ఆలయానికి వెళ్లి పీఠాధిపతులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌తోపాటు పలువురు ఉన్నారు.

KCR Swaroopanandendra: స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) మరోసారి విశాఖ శ్రీ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని (Swaroopanandendra Saraswati) ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలోని చందానగర్‌లో శ్రీ విశాఖ శారదాపీఠం పాలిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బస చేసిన స్వరూపానందేంద్రను కేసీఆర్ కలిశారు. బుధవారం ఆలయానికి వెళ్లి పీఠాధిపతులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌తోపాటు పలువురు ఉన్నారు.


కోకాపేటలో రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి సాయం..

హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల ఆరంభంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి చేతులమీదుగా శంకుస్థాపన జరిగింది. రూ.8 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయానికి కేసీఆర్ సర్కార్ రెండెకరాల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. శంకుస్థాపన సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతోనే కేసీఆర్ తమ పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించారని అన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే కేసీఆర్ ఆకాంక్షించారని తెలిపారు. రాజశ్యామల అమ్మవారి మహిమ గురించి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబాలను అడిగితే చెబుతారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-05-31T18:19:26+05:30 IST