Share News

Shabarimala: హైదరాబాద్ నుంచి శబరిమలకు ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Dec 14 , 2023 | 09:52 AM

అయ్యప్ప దీక్ష చేసే స్వాములు శబరిమలై వెళ్లేందుకు కావల్సిన ఆర్టీసీ బస్సులను బుకింగ్‌ చేసుకునేలా

Shabarimala: హైదరాబాద్ నుంచి శబరిమలకు ఆర్టీసీ బస్సులు

చాదర్‌ఘాట్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అయ్యప్ప దీక్ష చేసే స్వాములు శబరిమలై వెళ్లేందుకు కావల్సిన ఆర్టీసీ బస్సులను బుకింగ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్‌-2 డిపో మేనేజర్‌ కృష్ణమూర్తి(Hyderabad-2 Depot Manager Krishnamurthy) తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ఉన్న 40 సీట్లలో ఇద్దరు వంట చేసే వారికి, మరో ఇద్దరు 10 ఏళ్ల లోపు మణికంఠలకు, ఒక లగేజి బాయ్‌ ప్రయాణించేందుకు ఉచితంగా అనుమతించనున్నట్లు ఆయన వివరించారు. కిలోమీటర్‌కు రూ.65లుగా వెయింటింగ్‌ చార్జీగా ప్రతి గంటకు రూ.100లు, వసూలు చేయనున్నారు. ఆర్టీసీ బస్సు బుక్‌ చేసిన ఆర్టీసీ నేస్తం, ఏటీబీ ఏజెంట్లకు రోజుకు రూ.3వందలను కమీషన్‌గా ఇవ్వనున్నారు. బస్సు లోపల లగేజీ పెట్టుకోవడానికి స్వాముల కోరిక మేరకు సీట్లను తొలగిస్తామన్నారు. కర్ణాటక, తమిళనాడు(Karnataka, Tamil Nadu) రాష్ట్రాల్లో బార్డర్‌ టాక్స్‌లను బస్సులను బుకింగ్‌ చేసుకున్న స్వాములే భరించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం 7382837358, 7382838010, 9346559649, 9959226249 ద్వారా సంప్రదించవచ్చని డిపో మేనేజర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 14 , 2023 | 09:52 AM