విద్యార్థినులకు అసభ్యకర సందేశాలు పంపుతున్న యువకుడి అరెస్టు

ABN , First Publish Date - 2023-08-02T00:22:36+05:30 IST

కాలేజీ విద్యార్థినుల ఫోన్‌ నెంబర్లు సేకరించి గ్రూపు క్రియేట్‌ చేసి అసభ్య సందేశాలు, వీడియోలు పెడుతున్న యువకుడిపై రాచకొండ సీపీ పీడీయాక్ట్‌ ప్రయోగించారు.

విద్యార్థినులకు అసభ్యకర సందేశాలు పంపుతున్న యువకుడి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కాలేజీ విద్యార్థినుల ఫోన్‌ నెంబర్లు సేకరించి గ్రూపు క్రియేట్‌ చేసి అసభ్య సందేశాలు, వీడియోలు పెడుతున్న యువకుడిపై రాచకొండ సీపీ పీడీయాక్ట్‌ ప్రయోగించారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు ప్రాంతానికి చెందిన చొప్పర లక్ష్మిగణేష్‌ అనే యువకుడు విజయవాడ కృష్ణలంకలోని ఓహోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడి స్నేహితులతో కలిసి కాలేజీ యువతుల నెంబర్లు సేకరించి వాటితో గ్రూపులు రూపొందించారు. ఈగ్రూపుల్లో అసభ్య సందేశాలు, వీడియోలు పెట్టి యువతులను వేధింపులకు గురిచేశాడు. కాలేజీ నిర్వాహకుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన ఘట్‌కేసర్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో లక్ష్మీగణేష్‌ను అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించారు. యువతులను వేధించిన లక్ష్మీగణేష్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2023-08-02T00:22:36+05:30 IST