కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2023-07-21T00:54:15+05:30 IST

సమస్యలు పరిష్కరించాలంటూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు గురువారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వినతిపత్రమందజేస్తున్న కార్మికులు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన

ఇబ్రహీంపట్నం, జూలై 20: సమస్యలు పరిష్కరించాలంటూ విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులు గురువారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని 15 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్ధుల్లాపూర్‌మెట్‌ మండలాల నుంచి వచ్చిన కార్మికులు ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ గోడు వినడం లేదని కార్మికుల వాపోయారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వినతిపత్రమందజేశారు. సమస్యను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి తీసుకెళ్తానంటూ ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నర్సింహ, బుగ్గరాములు, కృష్ణ, చందునాయక్‌, గ్రామ పంచాయతీ యూనియన్‌ నాయకులు పాండు, దేవదాసు, యాదయ్య, సత్తిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2023-07-21T00:54:15+05:30 IST