మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2023-03-05T23:45:35+05:30 IST

మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు అన్నారు.

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
సైకిల్‌ ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా వైద్యాఽధికారి వెంకటేశ్వర్‌రావు

డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 5 : మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో హైదరాబాద్‌ నగరంలోని కాలె దాన్‌లోని ఇంద్రారెడ్డి స్టేడియంలో వైద్యసిబ్బందితో కూడిన సైకిల్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తమ ఆరోగ్య సమస్యలను వివరించి వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారి అరుణ, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు జయలక్ష్మి, సోలమన్‌, దివ్య, వందన తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-05T23:45:35+05:30 IST