మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-03-19T00:06:21+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

శంషాబాద్‌, మార్చి 18 : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో శనివారం సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే ముఖ్యఅథితిగా హాజరుకాగా.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ బండి గోపాల్‌యాదవ్‌లు హాజరయ్యారు. మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, ఎస్‌ఐ భానుమతి, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ శాఖల్లో పనిచేసే మహిళలను సన్మానించారు. కౌన్సిలర్లు, నాయకులు ఆయాశాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:06:21+05:30 IST