ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-03-05T23:46:18+05:30 IST

ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకుంది.

ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

కొత్తూర్‌, మార్చి 5 : ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకుంది. మండలంలోని పెంజర్ల గ్రామ శివారులో గల రాఘవ పాలిమర్‌ పరిశ్రమ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ధరంసోత్‌ మారు(38) అనే కూలీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సయూద్‌ తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలం దేవునిబండతండా గ్రామపంచాయతీలోని వెంకటమ్మతండాకు చెందిన మారు పెంజర్లకు వలసవచ్చి పాలిమర్‌ పరిశ్రమలో కూలి పనులు చేసుకుంటూ క్వార్టర్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటుంది. కాగా, ఆమె భర్త 15ఏళ్ల క్రితం చనిపోగా, కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు. జీవితం మీద విరక్తి చెందిన మారు అదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి పైకప్పు రాడ్‌కు ఉరేసుకొంది. ఈక్రమంలో చుట్టుపక్కల వారు గమనించి పరిశ్రమ యాజమాన్యానికి తెలిపారు. వారు వెంటనే ఉస్మానియాకు తరలించగా వైద్యులు అప్పటికే మృతిచెందిందని చెప్పారు. మృతురాలి కుమారుడు సుమన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-03-05T23:46:18+05:30 IST