భర్త హత్య కేసులో భార్య అరెస్టు

ABN , First Publish Date - 2023-09-23T00:19:42+05:30 IST

మండల పరిధిలోని పెంజర్లలో ఇటీవల జరిగిన పాముల నర్సింహ(50) అనే వ్యక్తి హత్య కేసులో భార్య నర్సమ్మను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.

భర్త హత్య కేసులో భార్య అరెస్టు

కొత్తూర్‌, సెప్టెంబరు 22: మండల పరిధిలోని పెంజర్లలో ఇటీవల జరిగిన పాముల నర్సింహ(50) అనే వ్యక్తి హత్య కేసులో భార్య నర్సమ్మను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. నర్సమ్మకు మహిళా సంఘంలో ఇటీవల డబ్బులు రాగా, ద్విచక్ర వాహనం ఇప్పించాలని నర్సింహ కోరాడు. అయితే, అందుకు నర్సమ్మ నిరాకరించింది. నాటి నుంచి ఇరువురి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఈనెల 19న భార్యభర్తలిద్దరూ మద్యం సేవించి గొడవకు దిగారు. ఈక్రమంలో నర్సింహపై భార్య నర్సమ్మ దాడిచేసి హత్య చేసింది. మృతుడి అన్న సత్తయ్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం కొత్తూర్‌లోని కల్లు దుకాణం వద్ద తిరుగుతున్న నర్సమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు నర్సమ్మ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-09-23T00:19:42+05:30 IST