ఈ రోడ్డును పట్టించుకునేదెవరు?

ABN , First Publish Date - 2023-08-02T00:28:14+05:30 IST

మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డుమార్గం అధ్వాన్నంగా మారింది.

ఈ రోడ్డును పట్టించుకునేదెవరు?
బషీరాబాద్‌లో గ్రామ పంచాయతీ సమీపంలో ప్రధానరోడ్డు దుస్థితి

బషీరాబాద్‌, ఆగస్టు 1: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డుమార్గం అధ్వాన్నంగా మారింది. వర్షం పడితే చాలు నీరంతా రోడ్డుపై గుంతల్లో చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ గుంతల్లో నీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మార్గం గుండా నిత్యం వివిధ శాఖల అధికారులు రాకపోకలు సాగిస్తున్నా ఏఒక్కరూ సమస్య పరిష్కారానికి దృష్టి సారించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతుఆన్నయి. ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-08-02T00:28:14+05:30 IST