Share News

‘తహసీల్దార్‌’ భవనం పూర్తయ్యేదెప్పుడో?

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:14 PM

రెండేళ్లు కావస్తున్నా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నైజాం కాలంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు.

‘తహసీల్దార్‌’ భవనం పూర్తయ్యేదెప్పుడో?
అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్‌ కార్యాలయం

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 17: రెండేళ్లు కావస్తున్నా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నైజాం కాలంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. దాని స్థలంలోనే 2022 ఫిబ్రవరిలో రూ.1.25కోట్ల డీఎంఎఫ్‌ నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ పైన ఒక అంతస్తు స్లాబులు పోసి గోడలు కట్టారు. మరో కోటి రూపాయలైతేగానీ కార్యాలయం పూర్తయ్యేలా లేదు. అదనపు నిధులకోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా.. నిధులు మాత్రం మంజూరు చేయలేకపోయింది. ఆ వెంటనే ఎన్నికలు వచ్చి.. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయం పంచాయతీరాజ్‌ అతిథి భవనంలో నడుస్తోంది. ఇది ఇరుకుగా ఉండడంతో ఫైళ్లను కూడా నేలమీదే పెట్టాల్సి వస్తోంది. పనులపై వచ్చేవారు కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది. అదేవిధంగా పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. ప్రభుత్వం త్వరితగతిన ని ధులు మంజూరుచేసి భవనం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:14 PM