Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

ABN , Publish Date - Dec 22 , 2023 | 11:43 PM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

యాచారం, డిసెంబరు 22 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం యాచారం వైస్‌ ఎంపీపీ కె.శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, పంచాయతీ రాజ్‌శాఖ ఏఈ ఉస్మాన్‌లు తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో పింఛన్ల దరఖాస్తులు తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుందన్నారు. త్వరలో గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రంగారెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు అరవింద్‌నాయక్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:44 PM