Share News

సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2023-11-20T23:55:35+05:30 IST

షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఆశీర్వదించి మరొక్కసారి అవకాశమివ్వాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, షాద్‌నగర్‌ ఎమ్మేల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు.

సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామరక్ష
యాచారం : మంచిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన బీజేపీ నాయకులు

షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

నందిగామ/షాద్‌నగర్‌, నవంబరు 20 : షాద్‌నగర్‌ నియోజకవర్గాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఆశీర్వదించి మరొక్కసారి అవకాశమివ్వాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, షాద్‌నగర్‌ ఎమ్మేల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం నందిగామ మండలంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మేల్యే అంజయ్యయాదవ్‌ విస్ర్తుత స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని అప్పారెడ్డిగూడ, చర్లఅంతిరెడ్డిగూడ, వీర్లపల్లి, మంచన్‌పాడు, మొదళ్లగూడ, మజీద్‌ మామిడిపల్లి, మామిడిపల్లి, శ్రీనివాసులగూడ, ఈదులపల్లి, మోత్కుళ్లగూడ గ్రామాల్లో అంజయ్యయాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాల్లాడుతూ పదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని ఇళ్లు లేదని గర్వంగా చెబుతున్నాని తెలిపారు. దేఽశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరిచి తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలపడం గర్వకారణమన్నారు తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయని, నక్సలైట్ల రాజ్యం వస్తుందన్న వారికి కేసీఆర్‌ అభివృద్దితో నోళ్లు మూయించారన్నారు. కాంగ్రెస్‌ 60 సంవత్సరాలల్లో చేయని అభివృద్ధి కేసిఆర్‌ 9 సంవత్సరాలల్లోనే చేసి చూపించారన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చే హామీలను ప్రజలు నమ్మవద్దని అన్నారు. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబందు, బీసీబందు ఇచ్చాడన్నారు. నందిగామ మండలంలో మాజి జడ్పీవై్‌సచైర్మన్‌ నవీన్‌రెడ్డి ఆద్వర్యంలో ఎమ్మేల్యే ప్రచారానికి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరైనారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీవైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌, మాజి మార్కెట్‌కమిటీ చైర్మన్‌ వి.నారయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షులు కాట్న లతాశ్రీశైలం సర్పంచులు జెకె. నర్సింలు, ఉమాదేవి, చంద్రారెడ్డి, కవితా శ్రీనివాస్‌, స్వామి, ఎల్లమ్మ, గోవిందు అశోక్‌ నాయకులు విఠల్‌, రాజ్యలక్ష్మి, అశోక్‌, వీరెందర్‌, బేగ్‌, సుదాకర్‌, సంతోష్‌, విజయ్‌, నీలమ్మ, గబ్రు, నర్సింహ్మ, రఘు, గణేష్‌, రవిందర్‌, సాయి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారంలో కౌన్సిలర్‌ అగ్గనూరు విశాల

షాద్‌నగర్‌ : నియోజకవర్గంలో గులాబి పార్టీని మళ్లీ గుబాలించాలని కౌన్సిలర్‌ అగ్గనూరు విశాల ఓటర్లను కోరారు. సోమవారం షాద్‌నగర్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. విశాల మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే మనకు చేటే జరుగుతుందని విమర్శించారు. నిరంతరం ప్రజా సేవకే అంకితమైన, నిరాడంబరుడు అంజయ్య యాదవ్‌కు ఓటు వేసి గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మూడోసారిగా గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Updated Date - 2023-11-20T23:55:36+05:30 IST