Share News

రాష్ట్రంలో సంక్షేమ పాలన

ABN , First Publish Date - 2023-12-10T23:03:45+05:30 IST

రాష్ట్రంలో సంక్షేమ పాలన మొదలైందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని, ఆత్మగౌరవం దక్కుతుందన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పాలన
నారాయణ రెడ్డిని సన్మానిస్తున్న విద్యానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, డిసెంబరు 10: రాష్ట్రంలో సంక్షేమ పాలన మొదలైందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని, ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా మండలాల కాంగ్రెస్‌ నేతలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నారాయణ రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో రెండు ప్రారంభమైనాయని, మిగతా నాలుగు వంద రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరించి రూ.10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. మహాలక్ష్మి పథకం పకడ్బందీగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ను సంక్షేమ, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ధ్యేయమన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఏ కష్టాలు ఉండవని, కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శంగా నిలిపేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతామని కసిరెడ్డి అన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు గుర్రం కేశవులు, బికుమాండ్ల రమేశ్‌, ఎండీ. పాష, కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి, తొండల పల్లి వెంకట్‌ రెడ్డి, కోట నవీన్‌, కసిరెడ్డి అశోక్‌ రెడ్డి, రుక్మారెడ్డి, బీచ్యనాయక్‌, నేజ్యనాయక్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, జంగయ్య, పాండు, చెన్నారెడ్డి, పత్యనాయక్‌, గుజ్జరి నర్సింహ్మ, లక్ష్మీనారాయణ, ఈరెడ్డి యాదగిరిరెడ్డి, వేణుగోపాల్‌, రామునాయక్‌, గూడూరు గోపాల్‌రెడ్డి, కాకికృష్ణ, విజయ్‌రాథోడ్‌, పర్వత్‌రెడ్డి, మోత్యనాయక్‌, కొండల్‌రెడ్డి, అంజన్‌రెడ్డి, నల్లబోతుల జంగయ్య, తదితరులున్నారు.

Updated Date - 2023-12-10T23:03:46+05:30 IST