ఎయిర్‌పోర్టులో కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఘనస్వాగతం

ABN , First Publish Date - 2023-04-09T23:26:26+05:30 IST

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం ఢిల్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

ఎయిర్‌పోర్టులో కిరణ్‌కుమార్‌ రెడ్డికి ఘనస్వాగతం
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న బీజేపీ కార్యకర్తలు

శంషాబాద్‌, ఏప్రిల్‌ 9 : మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం ఢిల్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు రావడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు అరైవల్స్‌ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి బయటకు రాగానే.. పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు. కాగా, ఆయన మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-09T23:26:26+05:30 IST