ఆమనగల్లును స్టడీ హబ్‌గా మారుస్తాం

ABN , First Publish Date - 2023-02-26T00:18:44+05:30 IST

విద్యారంగంలో ఆమనగల్లును అన్నివిధాలా అభివృద్ధి చేసి స్టడీ హబ్‌గా మారుస్తామని, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు.

ఆమనగల్లును స్టడీ హబ్‌గా మారుస్తాం
కళాశాల భవన నిర్మాణం పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు, ఫిబ్రవరి25 : విద్యారంగంలో ఆమనగల్లును అన్నివిధాలా అభివృద్ధి చేసి స్టడీ హబ్‌గా మారుస్తామని, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆమనగల్లులో పాలిటెక్నిక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆమనగల్లు పట్టణంలో రూ.2 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణం పనులను శనివారం ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధా పత్యనాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ కమటం రాధమ్మవెంకటయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు నాణ్యతగా, త్వరిత గతిన పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే రూ.2కోట్లతో బీసీ హాస్టల్‌ భవనంలో బీసీ స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాలను కలిపి ఆమనగల్లులో వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం మంజూరైందని జైపాల్‌ యాదవ్‌ వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సోనశ్రీను నాయక్‌, ఎంపీటీసీ సరితా పంతూనాయక్‌, నాయకులు చుక్కా నిరంజన్‌గౌడ్‌, తల్లోజు రామకృష్ణ, సయ్యద్‌ ఖలీల్‌, పురుషోత్తం, రంజిత్‌, శివ, శ్రీను, విక్రమ్‌, శేఖర్‌, రమేశ్‌, మల్లేశ్‌ నాయక్‌, యాదగిరి, తోట కృష్ణ, జంతుక కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-26T00:18:45+05:30 IST