నూతన గ్రంథాలయ భవనం నిర్మిస్తాం

ABN , First Publish Date - 2023-08-22T23:32:16+05:30 IST

గ్రంథాలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు.

నూతన గ్రంథాలయ భవనం నిర్మిస్తాం
చేవెళ్లలో స్థలం పరిశీలన చేస్తున్న సత్తు వెంకటరమణారెడ్డి

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి

చేవెళ్ల, ఆగస్టు 22 : గ్రంథాలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి మంగళవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయాలను సమగ్రంగా ఆధునికీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి సబితారెడ్డి గ్రంథాలయల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని స్పష్టం చేశారు. జిల్లాలో రూ.18 కోట్లతో గ్రంథాలయాలకు ఆధునూతన భవనాలు నిర్మించేందుకు సకల వసతులు కల్పించే విధంగా చర్యలు ప్రారంభించామన్నారు. చేవెళ్లలో ఎమ్మెల్యే యాదయ్య సూచనల మేరకు రూ. 1.80 కోట్లతో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. తొందరలోనే మంత్రి, ఎంపీ. ఎమ్మెల్యేల చేతులు మీదుగా భూమి పూజ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ లైబ్రేరియన్‌ సత్యనారాయణ, నాయకులు ఆగిరెడ్డి, ఎ.ఈ. శ్యామ్‌, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, గ్రంథాలయ సిబ్బంది నవాబ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:32:16+05:30 IST