ప్రజాతీర్పును గౌరవిస్తాం
ABN , First Publish Date - 2023-12-05T23:14:16+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి సహకారమందిస్తామని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ తెలిపారు.
ప్రగతికి సహకారమందిస్తాం
మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్ అర్బన్, డిసెంబరు 5: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి సహకారమందిస్తామని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ తెలిపారు. షాద్‌నగర్ బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేసిన ప్రజలకు, సహకరించిన పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవున్నా.. లేకపోయినా.. తాను ప్రజా క్షేత్రంలోనే ఉంటూ సేవలను కొనసాగిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్ కార్యకర్తలు కుంగిపోవద్దని, ఏమాత్రం అధైౖర్యపడవద్దని కోరారు. షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకువచ్చిన తనకు పది సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారని, మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి పనిచేస్తానని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సహితం సంయమనం పాటించాలని అంజయ్యయాదవ్ కోరారు. షాద్‌నగర్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన అంజయ్యయాదవ్‌ను ప్రజలు ఆదరించకపోవడం బాధ కలిగిస్తుందని జడ్పీ వైస్‌చైర్మన్ ఈటె గణేష్, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, షాద్‌నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నారాయణరెడ్డిలు ఈసందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ బెదిరింపులకు భయపడం
ఎన్నికల్లో విజయం సాధించగానే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న బెదిరింపులకు ఏమాత్రం భయపడబోమని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నాగరకుంట నవీన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి, నాయకుడికి వారు ఓట్లు వేస్తారని, అంత మాత్రాన దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టింగ్‌లు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన పార్టీల నాయకులు, కార్యకర్తలు హూందాగా ఉండాలని, అందరినీ కలుపుకుని పోవాలే తప్ప, కవ్వింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదని నవీన్‌రెడ్డి తెలిపారు.