గోదాంలను వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 28 , 2023 | 12:26 AM
రైతులు గోదాములను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు. మండల పరిధిలోని మల్కారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన గోదాముల సముదాయం, నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీ్‌షతో కలిసి బుధవారం ప్రారంభించారు.
శంషాబాద్ రూరల్, డిసెంబరు 27 : రైతులు గోదాములను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ అన్నారు. మండల పరిధిలోని మల్కారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన గోదాముల సముదాయం, నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీ్‌షతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గోదాముల సముదాయన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్వీరాజు, చైర్మన్ వెంకటే్‌షగౌడ్, స్థానిక సర్పంచ్ మాధవి, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.