కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి
ABN , First Publish Date - 2023-11-20T00:10:15+05:30 IST
సంక్షేమ పథకాలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్‌ఎస్ అభ్యర్థి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరారు.

షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్‌నగర్/నందిగామ, నవంబరు 19 : సంక్షేమ పథకాలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్‌ఎస్ అభ్యర్థి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోరారు. ఆదివారం నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట తాండ, రంగాపూర్, నందిగామలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు రంగాపూర్ గ్రామ మహిళలు బతుకమ్మలతో ఆయనకు స్వాగతం పలికారు. అంజయ్య మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే పేదల బతుకులు బాగుపడ్డాయని చెప్పారు. మరోసారి అవకాశం ఇస్తే వారి జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపుతామన్నారు. కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఆరు పథకాలపై వారికే అవగాహన లేదని, ఆ పార్టీ మాటలు నమ్మి ఓటువేసిన పొరుగు రాష్ట్రంలోని రైతులు నెత్తిన చేయి పెట్టుకుని కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితు లు దాపురించాయని విమర్శించారు. ఇక్కడ కూడా చేయి గుర్తుకు ఓటు వేస్తే మన రైతుల పరిస్థితి కూడా దుర్భరంగా మారుతుందన్నారు. తాను ఒక ఎమ్మెల్యేగా గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసానని, చేయాల్సింది ఇంకా మిగిలి ఉందన్నారు. ఈఎన్నికల్లో కూడా తనకే ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరికలు
కొత్తూర్ : బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తనయుడు, కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. స్థానిక జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు షాద్‌నగర్ క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లి రవీందర్‌యాదవ్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు.
అంజయ్య యాదవ్‌ను గెలిపించండి
షాద్‌నగర్ : ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ను గెలిపించాలని బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో గ్రంథాలయ చైర్మన్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న బీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లాడ శేఖర్, సభ్యులు జంగరాజ్, కొవూరు నవీన్ కుమార్, గుర్రంపల్లి కొమరేష్, అందె కృష్ణ, జగన్ తదితరులు పాల్గొన్నారు.