ఓటేసి దీవించండి.. అభివృద్ధికి పాటుపడతా
ABN , First Publish Date - 2023-11-20T23:47:17+05:30 IST
ఓటేసి దీవిస్తే ఈప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్
ఘట్‌కేసర్ మండలంలో పలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు
ఘట్‌కేసర్, నవంబరు 20: ఓటేసి దీవిస్తే ఈప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం ఘట్‌కేసర్ మండలంలోని ఆవుషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్, మర్పల్లిగూడ, కొర్రెముల్, వెంకటాపూర్, చౌదరిగూడ గ్రామపంచాయతీల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. మల్లారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే చెరువులు, కుంటలు ఆక్రమించాడని ఆరోపించారు. ఈప్రాంతంలో ప్రజలకు అవసరమైన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా ప్రజలను మోసగించాడని అన్నారు. తూంకుంటలో ఆయా పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దమ్మాగూడలో కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేష్ యాదవ్‌కు మద్దతుగా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముప్ప రామారావు ఆద్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్, బొక్కొనిగూడ, చందుపట్లగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేష్ యాదవ్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, కందుల కుమార్, రాపోలు రాములు, కర్రె రాజేష్, వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, మేడబోయిన వెంకటేష్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, సుదాకర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, కట్ట రాజశేఖర్‌రెడ్డి, సంజీవరెడ్డి, కౌన్సిలర్ శ్రీలత, వాణినాగేష్, మాజీ సర్పంచ్ వరలక్ష్మి, కొల్కూరు మహేష్, లింగేశ్వర్, నాగేష్, బాల్‌రాంతదితరులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థను శాసించడం వల్లే పేపరు లీకేజీలు
ఘట్‌కేసర్: విద్యావ్యవస్థను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి విద్యా వ్యాపారులు శాసిస్తున్నారని, అందుకే పేపరు లీకేజీలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ఆరోపించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా, ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ లోని వెంకటాద్రి టౌన్‌షి్‌పలో మేడ్చల్ నియోజవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రే్‌షయాదవ్ ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. నేడు కేసీఆర్ ప్రభుత్వంలోని మూడొంతుల మంత్రులు తెలంగాణ ద్రోహులేనని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలను వంచించిన కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘సీఎం కేసీఆర్ కుమార్తె మద్యం వ్యాపారం చేసి కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడడంతో కేసీఆర్ వెంటనే ప్రధాని మోదీ కాళ్లుపట్టుకున్నారు. దాంతో కవితను మోదీ జైలుకు వెళ్ల్లకుండా రక్షించారు. మోదీ, కేసీఆర్ ఒక్కటే. దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే వాళ్లు పోవాలి’’ అని నారాయణ పేర్కొన్నారు. వజ్రాయుధంలాంటి ఓటును కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్‌కు వేసి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్ పాల్గొన్నారు.