తాండూరు వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌గా వీణ

ABN , First Publish Date - 2023-08-16T00:11:55+05:30 IST

తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా వీణా శ్రీనివాసాచారి, వైస్‌చైర్మన్‌గా ఉమాశంకర్‌ పేర్లు నామినేటెడ్‌ చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రతిపాదించారు.

తాండూరు వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌గా వీణ

తాండూరు, ఆగస్టు 15: తాండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా వీణా శ్రీనివాసాచారి, వైస్‌చైర్మన్‌గా ఉమాశంకర్‌ పేర్లు నామినేటెడ్‌ చేసేందుకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్‌ల నామినేటెడ్‌కు సంబంధించి పార్టీ ముఖ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అక్టోబర్‌ 23తో పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. మొదట వీణ పేరు తెరపైకి వచ్చాక తర్వాత కౌన్సిలర్‌ విజయాదేవికి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. చివరకు వీణ శ్రీనివాసాచారికే పదవి కట్టబెట్టనున్నారు. కొత్త పాలకవర్గం రెండేళ్లు కొనసాగే విధంగా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ నెలలో పాలకవర్గం ఏర్పడే అవకాశం ఉంది.

Updated Date - 2023-08-16T00:11:55+05:30 IST