‘కంటి వెలుగు’ను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-05-25T23:57:25+05:30 IST

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని పాల్మాకుల సర్పంచ్‌ పంతంగి సుస్మారాజ్‌ భూపాల్‌గౌడ్‌ అన్నారు.

‘కంటి వెలుగు’ను వినియోగించుకోవాలి
శంషాబాద్‌ రూరల్‌ : కళ్లద్దాలు, మందులు పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ సుష్మారాజ్‌ భూపాల్‌గౌడ్‌

శంషాబాద్‌ రూరల్‌/చౌదరిగూడ/ఆమనగల్లు/చేవెళ్ల, మే 25 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని పాల్మాకుల సర్పంచ్‌ పంతంగి సుస్మారాజ్‌ భూపాల్‌గౌడ్‌ అన్నారు. పెద్దషాపూర్‌ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందంచే నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో భాగంగా గురువారం బాధితులకు కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ప్రభాకర్‌రావు, డాక్టర్‌ ఉస్మాన్‌, సిబ్బంది రాహుల్‌, రజిని, విద్యులత, ప్రమీల, ఉపసర్పంచ్‌ హరిందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ ఆగ్రహారం రాణి శ్రీశైలం అన్నారు. గురువారం జిల్లేడ్‌-చౌదరిగూడ మండల పరిధిలోని జాకారంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చూపు లోపం ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి కళ్లద్దాలను, మందులను పంపిణీ చేస్తుందన్నారు. కంటివెలుగు శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శ్వేత, సిబ్బంది శ్రీలత, సునిత, ఇంద్రజ, ఆశోక్‌, ఉప సర్పంచ్‌ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ బీమనపల్లి దుర్గయ్యలు కోరారు. నేత్ర సంరక్షణలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆమనగల్లు మున్సిపాలిటీ జంగారెడ్డి పల్లి గ్రామంలో గురువారం ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ దుడ్డు కృష్ణయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్యలతో కలిసి రాంపాల్‌నాయక్‌ శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్‌ మంజులాదేవి, ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి, వైద్యసిబ్బంది, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మండలం దేవరం పల్లి సర్పంచ్‌ నరహరిరెడ్డి అన్నారు. గురువారం గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని వైద్యులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మల్లేశ్‌, వైద్యులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:57:25+05:30 IST