Share News

రసాయనాల వాడకం తగ్గించాలి

ABN , First Publish Date - 2023-12-05T23:30:55+05:30 IST

రైతులు పంట దిగుబడులకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకుని, భూమి పొరల్లో కర్బనశాతాన్ని పెంచేందుకు కృషిచేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు జయరేఖ, సి.నరేందర్‌రెడ్డి సూచించారు.

రసాయనాల వాడకం తగ్గించాలి
నేలను పరిరక్షించుకోవాలని పోస్టర్ల ద్వారా వివరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

భూమి పొరల్లో కర్బన శాతాన్ని పెంచాలి

రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన

కొత్తూర్‌, డిసెంబరు 5: రైతులు పంట దిగుబడులకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకుని, భూమి పొరల్లో కర్బనశాతాన్ని పెంచేందుకు కృషిచేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు జయరేఖ, సి.నరేందర్‌రెడ్డి సూచించారు. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ కళాశాల దత్తత గ్రామం గూడూర్‌లో మంగళవారం ‘ప్రపంచ నేల దినోత్సవాన్ని’ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల వివిధ విభాగాల శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు సహజ సాగువిధానాలపై సూచించారు. పంటల దిగుబడికి రైతులు రసాయనాలను ఎక్కువగా వాడకుండా పచ్చిరొట్ట, పశువుల పేడ వాడి భూమిని సారవంతంగా మార్చుకోవాలన్నారు. భూమి పొరల్లో కర్బన పదార్థాల పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల ఏఈఎల్‌పీ విద్యార్థులు మట్టి నమునా పరీక్ష విధానాన్ని ప్రదర్శించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సత్తయ్య, ఉపసర్పంచ్‌ దయానంద్‌, శాస్త్రవేత్తలు జయశ్రీ, రమేష్‌, దత్తత గ్రామ కమిటీ సభ్యులు శైలజ, సమత, పరమేశ్వరి, అరుణ, శకుంతలాదేవి, ఏఈవో అనిత, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-05T23:31:37+05:30 IST