ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-12-10T22:54:29+05:30 IST
షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మహబూబ్‌నగర్ రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపారు.
షాద్‌నగర్ రూరల్, డిసెంబరు 10: షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మహబూబ్‌నగర్ రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ తెలిపారు. సుమారు 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జీకి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9848090426 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.