అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయం
ABN , First Publish Date - 2023-02-21T23:50:23+05:30 IST
కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న అన్నారు.
దోమ, ఫిబ్రవరి 21: కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో ఆదివారం మృతిచెందగా ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బీఎస్పీ మండల అధ్యక్షుడు మల్లన్న అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్న దళితుడైనందువల్లే పాలకులు ఆయనను అవమానించారన్నారు. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ దళిత ఎమ్మెల్యేలు గమనించాలని కోరారు. సిట్టిం గ్ ఎమ్మెల్యే సాయన్నను అవమానపర్చిన విధంగానే వారికీ ఇదే గతి పడుతుందన్నారు. దళితులకో న్యాయం, అగ్రవర్ణాలకు ఓ న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రమేశ్, మల్లేశ్, మొగులప్ప, భీమేశ్, వెంకటయ్య, రాములు పాల్గొన్నారు.