Share News

అండర్‌ పాస్‌లు నిర్మించాలి

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:16 PM

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఘట్‌కేసర్‌ మండలంలోని హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిని దాటేందుకు అండర్‌ పాస్‌లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అండర్‌ పాస్‌లు నిర్మించాలి
వినతిపత్రం అందజేస్తున్న ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి

ఘట్‌కేసర్‌, డిసెంబరు 14: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఘట్‌కేసర్‌ మండలంలోని హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిని దాటేందుకు అండర్‌ పాస్‌లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడైన డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గురువారం ఢిలీల్లో లక్ష్మణ్‌ను కలిసిన ఆయన ఘట్‌కేసర్‌లోని మైసమ్మగుట్ట కాలనీకి వెళ్లేందుకు స్థానిక యంనంపేట్‌ చౌరస్తా వద్ద, అన్నోజిగూడలోని ఎన్టీపీసీ చౌరస్తా వద్ద అండర్‌ పాస్‌ల నిర్మాణం చేపట్టి ప్రజలు జాతీయ రహదారిని దాటేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. నారపల్లిలోని కోర్రెముల చౌరస్తా, జోడిమెట్లలోని పోచారం చౌరస్తా, వద్ద అండర్‌ పాస్‌, ఎన్‌ఎఫ్‌సీనగర్‌ వద్ద రైల్వే వంతెన నిర్మాణంచేపట్టి ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరినట్లు ఎంపీపీ తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 11:16 PM