రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2023-01-18T00:06:10+05:30 IST
బైక్ పందిని ఢీకొనడంతో వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
కొడంగల్ రూరల్, జనవరి 17: బైక్ పందిని ఢీకొనడంతో వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్ శివారు ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం స్కూప్ ఐస్‌క్రీం ఏజెన్సీ నిర్వాహకుడు రాజనరేంద్ర, పురుషోత్తం రావుల్‌పల్లి నుంచి కొడంగల్ మీదుగా బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తున్నారు. పంది అడ్డు వచ్చి వారి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.