ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-06-26T00:15:50+05:30 IST
ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
కేశంపేట, జూన్ 25: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన పోగుల జంగయ్య(48) ఆదివారం రాత్రి కేశంపేట నుంచి తొమ్మిది రేకులకు వెళ్తున్నాడు. ఈక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం సింగందొడ్డికి చెందిన కొడిగే వంశీ(19) తొమ్మిది రేకుల నుంచి కేశంపేటకు వెళ్తుండగా మార్గ మాధ్యలో సుందరాపురం గ్రామ శివారులో ఎదురెదురుగా వారి బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో జంగయ్య మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు కేశంపేట పోలీసులు తెలిపారు.