Share News

తుక్కుగూడను మరో హైటెక్‌ సిటీగా మారుస్తా

ABN , First Publish Date - 2023-11-20T23:46:55+05:30 IST

మరోసారి అవకాశమిచ్చి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తుక్కుగూడను మరో హైటెక్‌ సిటీగా మారుస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

తుక్కుగూడను మరో హైటెక్‌ సిటీగా మారుస్తా
కందుకూరు : తిమ్మాపురంలో మాట్లాడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, నవంబరు 20 : మరోసారి అవకాశమిచ్చి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. తుక్కుగూడను మరో హైటెక్‌ సిటీగా మారుస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహేశ్వరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు అభివృద్ధికి తోడ్పడుతారో ప్రజలు ఆలోచించి వారికే ఓటు వేయాలన్నారు. గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం ఇక్కడ వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆరే అవుతారని ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ అమలు పరుస్తున్నామన్నారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రతి పేద వాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా చేరేలా చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అదే విధంగా మండలంలోని గట్టుపల్లి గ్రామానికి చెందిన యువకులు మొదటిసారి ఓటు హక్కు రావడంతో మంత్రి సబితారెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గట్టుపల్లి బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, సాదత్‌, తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ నాయకులు జె. లక్ష్మయ్య, సప్పిడిరాజు, శ్రీకాంత్‌, యు. శ్రీనివాస్‌, బుచ్చిరెడ్డి, ఆర్‌. సుమన్‌, రవినాయక్‌, నర్సిహ్మరెడ్డి, యాదయ్య, పద్మ, తధితరులు పాల్గొన్నారు.

అభివృద్ది, సంక్షేమానికి పెద్దపీట

కందుకూరు : అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశాం.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనకు మరో సారి అవకాశ ం ఇవ్వాలని మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డి కోరారు. సోమవారం కందుకూరు మండలంలోని సరస్వతిగూడ, అగర్‌మియాగూడ, లేమూరు, తిమ్మాపురం, జబ్బార్‌గూడ, బేగంపేట, రాచులూరు, బైరాగిగూడ, కొత్తూరు గ్రామాలలో నర్విహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలలో పాల్గొని మాట్లాడారు. ఆంజనేయస్వామి లేని ఊరు లేదని... ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లు లేదన్నారు. ఇలాంటి తరుణంలో ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. పూర్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ జిల్లాలో వేసవి వచ్చిందంటే మంచినీటి ఎద్దడితో మహిళలు కాళీ బిందెల పట్టుకొని రోడ్లపైకి వచ్చే వరన్నారు. కాని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేశామన్నారు. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చే ప్రతిపక్షాల నాయకులను నమ్మితే గతంలో ప్రజలు ఎదుర్కోనే సమస్యలు మరోసారి పునరావృతమౌతాయని గుర్తు చేశారు. ఇబ్రహింపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ రంగారెడ్డి, మహభూబ్‌నగర్‌ ఎత్తి పోతల పథకం ద్వార ఈ ప్రాంతానికి సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని దీంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

సబితాఇంద్రారెడ్డి ఘన స్వాగతం

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి, బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి పి.సబితాఇంద్రారెడ్డికి సోమవారం కందుకూరు మండలంలోని సరా స్వతిగూడ, అగర్‌మియాగూడ, లేమూరు, తిమ్మాపురం, జబ్బార్‌గూడ, బేగంపేట, రాచులూరు, బైరాగిగూడ, కొత్తూరు గ్రామాల ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అబిమానులు ఘనంగా స్వాగతం పలికారు. కిలోమీటర్ల మేరకు మహిళలు, రైతులు, నాయకులు కాలినడకన సభ వరకు గ్రామాల్లో ర్యీలీగా వెల్లారు. ఇటీవల మంత్రి హోదాలో వచ్చినట్లుగా సబితాఇంద్రారెడ్డికి ఎన్నికల సమయంలో అలాగే తరలి వచ్చారు. దీంతో బీఆర్‌ఎస్‌ శేణుల్లో ఉత్సాహం నెలకొన్నది.

బీఆర్‌ఎస్‌లో రేరిన సరస్వతిగూడ, గుమ్మడవెల్లి వాసులు

సబితాఇంద్రారెడ్డి సమక్షంలో కందుకూరు మండలంలోని సరస్వతిగూడకు చెందిన కాగెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జి.సంగారెడ్డి ఆద్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరారు. అలాగే గుమ్మడవెళ్లి, గుమ్మడవెళ్లి తాండలకు చెందిన యువకులు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు రాజీనామ చేసి బీఆర్‌ఎస్‌ పార్టీ గిరిజన నేత దేవీలాల్‌ నాయక్‌ మరి కొందరి ఆద్వర్యంలో సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ ఎస్‌ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, వైఎస్‌ చైర్మన్‌ జి.విజయేందర్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్‌ సురేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మన్నె జయేందర్‌ముదిరాజ్‌, మహిళా అధ్యక్షురాలు టి.ఇందిర దేవేందర్‌, మాజీ ఎంపీపీ వట్నాల శోభ ఈశ్వర్‌గౌడ్‌, సర్పంచ్‌లు రాము, భూపాల్‌రెడ్డి, పరంజ్యోతి, గంగాపురం గోపాల్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, సుగుణమ్మ, గోవర్ధన్‌, శ్రీనివాసచారి, ఎంపీటీసీలు రాములు, సురేష్‌, లలితాకుమార్‌, యాదయ్య, నాయకులు చిలుకమర్రి నర్సింహ, లక్ష్మీనర్సింహ్మరెడ్డి, అంజయ్యగౌడ్‌, సధానంద్‌గౌడ్‌, వెంకటే్‌సగౌడ్‌, ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, ఆనంద్‌, దావుద్‌, తదితరులున్నారు.

సీఎం సభను విజయవంతం చేయాలి : సబితా ఇంద్రారెడ్డి

ఈనెల 23న బడంగ్‌పేటలోని ఆర్మీ రోడ్డులో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. బహిరంగ సభకు బీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆమెకోరారు.

Updated Date - 2023-11-20T23:46:56+05:30 IST