కల్నల్‌ వినయ్‌భానురెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2023-03-19T00:03:53+05:30 IST

లెఫ్ట్‌నెట్‌ కల్నల్‌ ఉప్పల వినయ్‌ భానురెడ్డికి కీసర ప్రజలు ఘన నివాళులర్పించారు. రెండు రోజుల క్రితం వినయ్‌ భానురెడ్డి, మరో కోపైలెట్‌ చీత హెలికాప్టార్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి అస్సాం వెళ్తుండగా అక్కడ కొండ ప్రాంతంలో సిగ్నల్‌ అందకపోవడంతో హెలికాప్టార్‌ కూలిపోయింది.

కల్నల్‌ వినయ్‌భానురెడ్డికి ఘన నివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న కీసర ప్రజలు

కీసర, మార్చి 18: లెఫ్ట్‌నెట్‌ కల్నల్‌ ఉప్పల వినయ్‌ భానురెడ్డికి కీసర ప్రజలు ఘన నివాళులర్పించారు. రెండు రోజుల క్రితం వినయ్‌ భానురెడ్డి, మరో కోపైలెట్‌ చీత హెలికాప్టార్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి అస్సాం వెళ్తుండగా అక్కడ కొండ ప్రాంతంలో సిగ్నల్‌ అందకపోవడంతో హెలికాప్టార్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో వినయ్‌భానురెడ్డితో పాటు ఆయన తోటి సైనికుడు మృతిచెందారు. కాగా వినయ్‌ భానురెడ్డి నివాసం మేడ్చల్‌ పక్క జిల్లా యాద్రాది కావడంతో శనివారం ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో కీసర మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. దీంతో కీసర ప్రజలు ఆయనకు ఘన నివాళులర్పించారు.

Updated Date - 2023-03-19T00:03:53+05:30 IST