ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2023-03-25T23:23:41+05:30 IST

కొత్తూర్‌ గ్రామ శివారులో వడిచర్ల గ్రామం నుంచి శుక్రవారం రాత్రి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్‌లను పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

బొంరా్‌సపేట్‌/బషీరాబాద్‌, మార్చి 25: కొత్తూర్‌ గ్రామ శివారులో వడిచర్ల గ్రామం నుంచి శుక్రవారం రాత్రి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్‌లను పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా బషీరాబాద్‌ మండలంలోని మైల్వార్‌ శివారులో మున్నూరు శ్యామప్ప ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-03-25T23:23:41+05:30 IST