పేకాడుతున్న ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2023-09-20T00:24:10+05:30 IST
పేకాట ఆడుతున్న ముగ్గురిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టుచేసి పోలీసులకు అప్పగించారు.

ఘట్‌కేసర్ రూరల్, సెప్టెంబరు 19: పేకాట ఆడుతున్న ముగ్గురిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టుచేసి పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధి ఎదులాబాద్‌కు ముగ్గురు వ్యక్తులు గుట్టుచప్పు డు కాకుండా ఓ వ్యవసాయ క్షేత్రం వద్ద పేకాట ఆడారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటీ టీం దాడిచేసింది. వారి నుంచి ప్లేకార్డులు, మూడు సెల్‌ఫోన్లు, రూ.7,850 స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.